Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

గాంధీకి జర్నలిస్టుల లేక

నే టి సత్యం /కామారెడ్డి /సెప్టెంబర్ 2
జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి

టి యు డబ్ల్యూ జె ( ఐజేయు) ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి – కామారెడ్డిలో దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవం

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకై దశాబ్దాలుగా పోరాటం సాగుతోందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే – ఐజేయు ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. రజనీకాంత్, టి. రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.

టి యు డబ్ల్యూ జె ( ఐజేయు ) పిలుపు మేరకు దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి టి యు డబ్ల్యూ జె ( ఐజేయు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్ లు మాట్లాడుతూ మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోవడం విచారకరమన్నారు.

భారత రాష్ట్రపతితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

తమ డిమాండ్లు 1982 తర్వాత వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను పొందుపరిచి నూతన మీడియా కమిషన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలి- దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై శారీరక దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల ఘటనలు జరుగుతున్న తరుణంలో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక జాతీయ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. గతంలో రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి- ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులకు నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలి- రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి- ఉచిత, నాణ్యమైన వైద్యం కోసం జర్నలిస్టులందరికీ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేయాలి.

మీడియా స్వేచ్ఛను పరిరక్షించడంలో, జర్నలిస్టుల ఐక్యతను చాటడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షులు అబిద్, శంకర్, నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments