“కృష్ణమ్మ” ఎండి పోగా 6 నెలల ముందే దర్శనమిస్తున్న “సంగమేశ్వరుడు”…
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, అక్టోబర్ 7, నేటి సత్యం.
ఏలినో ప్రభావం వలన ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల మూలము గా కృష్ణా నది కి నీరు సక్రమం గా రాక ముందుగానే కృష్ణమ్మ ఎండి పోతుండడం తో ఎనిమిది నెలల తర్వాత భక్తులకు దర్శనము ఇవ్వవలసిన కృష్ణమ్మ ఒడిలో జలదిగ్బంధమై ఉన్న సంగమేశ్వరుడు ఆరు నెలల ముందుగానే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వర్షా బావ పరిస్థితుల మూలము గా వర్షాలు సమృద్ధిగా పడక కృష్ణా నదికి నీరు అంతంత మాత్రమే వచ్చినది.
చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధం గా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రలలో కురిసిన వర్షాలకు కొద్దిపాటి వరదలు రావడం తో కృష్ణా నది కి ఒక మాదిరి నీరు ఈ సంవత్సరం వర్షాకాలం లో వచ్చినది.
కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామ సమీపం లో ఉన్న సప్త నదుల సంఘం ప్రదేశం లో కృష్ణానది మధ్యలో వెలసివున్న శ్రీ సంగమేశ్వర దేవాలయం ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షపు నీటికి కృష్ణానది లో మునిగిపోతూ ఉండేది.
అలా కృష్ణానది నీటిలో మునిగిన శ్రీ సంగమేశ్వర దేవాలయం తిరిగి ఫిబ్రవరి మార్చి నెలలలో కృష్ణ నది లో నీరు ఎండా కాలం లో తగ్గిన తర్వాత నది గర్భం నుండి సంగమేశ్వర దేవాలయం, దేవాలయం లో పాండవుల అరణ్యవాస కాలం లో ధర్మరాజు చే ప్రతిష్టింపబడిన వేపదారు శివలింగం తేలి భక్తులకు దర్శనం ఇచ్చేది.
అలాగే ఈ సంవత్సరము కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కృష్ణా నదికి వచ్చిన కొద్దిపాటి వరదల కారణం గా కృష్ణానది తీరం లో సప్త నదుల సంగమ ప్రాంతంలో ఉన్న శ్రీ సంగమేశ్వర దేవాలయం కూడా కృష్ణానది నీటిలో మునిగి పోయనది.
అయితే కృష్ణా నది లో ఉన్న నీటిని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటు తెలంగాణ రాష్ట్రము ఇప్పటి ముప్పడిగా వాడు కొంటుండడం తో కృష్ణా నది లో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోయి ఎనిమిది నెలల కాలం తర్వాత నీటి నుండి బయట పడవలసిన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సెప్టెంబర్ చివరి కే కృష్ణా నది
గర్భం నుండి తేలి భక్తులకు గోపుర దర్శనం ఇస్తున్నది. రోజురోజుకు కృష్ణానదిలో తగ్గిపోతున్న నీటి మూలముగా ఇక పక్షం రోజులలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం పూర్తిగా కృష్ణానది నుండి తేలి భక్తులకు దర్శనమిచ్చే పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని ఆలయ అర్చకులు ఆ ప్రాంత భక్తులు తెలియజేశారు.
గత 25 ఏళ్ల చరిత్రలో ఏనాడు ఇలా జరగలేదని ఆగస్టు సెప్టెంబర్ నెలలో కురిసే వర్షానికి కృష్ణానది తీరం లో ఉన్న శ్రీ సంగమేశ్వర దేవాలయం కృష్ణానది నీటిలో పూర్తిగా మునిగిపోయి ఫిబ్రవరి మార్చి నెలలో నీటిమట్టం తగ్గి 8 నెలల తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వవలసిన శ్రీ సంగమేశ్వర దేవాలయం సెప్టెంబర్ నెల చివరికి కృష్ణా నది గర్భం నుండి బయటపడుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారని ఇది ముందు ముందు ఏ ఉపద్రవాలకు కారణమో తెలియదని సోమశిల గ్రామ ప్రజలు, భక్తులు తమ అభిప్రాయా భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.