Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

నేటి సత్యం /ఖమ్మం /నవంబర్ 3

-తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

-తక్షణం కరువు నివారణ నిధులు విడుదల చేయాలి

-రుణాలను రీ షెడ్యూల్ చేయాలి- ఉపాధి పనులు చేపట్టాలి

-నిత్యావసరాల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి

-కూనంనేని డిమాండ్

-కరువు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ బృందం

: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనతో సరిపుచ్చుకోకుండా తక్షణం కరువు నివారణ చర్యలకు నిధులు -విడుదల చేయాలని ఆయన కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో తనికెళ్ల, కొణిజర్ల తదితర కరువు ప్రభావిత మండలాల్లో సిపిఐ బృందం పర్యటించింది. సాగు చేయని పొలాలు, నీటికి నోచుకోని చెరువులను, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పలు చోట్ల అడుగంటిన భూగర్భ జలాల స్థితిని తెలుసుకోవడంతో పాటు -రైతులను కరువు పరిస్థితిపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనికెళ్లలో ఏర్పాటు చేసిన మీడియా -సమావేశంలో సాంబశివరావు మాట్లాడుతూ తక్షణం రూ.25వేల కోట్లను కేంద్రం నిధులు విడుదల చేయాలని అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కరువు పనులు కొనసాగించేందుకు తన వంతు నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. కరువుకు -సంబంధించి పరస్పర ఆరోపణలు చేయకుండా సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతి విపత్తు కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎల్సినో కారణంగా లోటు వర్షపాతం నమోదైందని చెరువులు, కుంటలకు నీరు చేరలేదని రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు వేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిందని కూనంనేని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది ఖరీఫ్ 69.19 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే ఈఏడాది 57.04 లక్షల ఎకరాలలో మాత్రమే వరి సాగు చేశారని అది కూడా దిగుబడి -పలు చోట్ల తగ్గుతుందన్నారు. ఒక వరి విస్తీర్ణమే 12.15 లక్షల ఎకరాలు తగ్గిందని ఈ దశలో పంటలు సాగు చేయని రైతులను కూడా ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కరువుపీడిత గ్రామల్లో పరిశీలన చేయాలని, పరిహారానికి తక్షణం చర్యలు చేపట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రెండు లక్షల -రుణమాఫీ కానీ రైతుల రుణాలను ఇప్పుడు మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులను కేటాయించాలని విబి జీ రాంజీ పథకం ద్వారా పనులు చేపట్టడంతో పాటు పని దినాల సంఖ్యను పెంచాలన్నారు. కూలీ కూడా గిట్టుబాటు అయ్యేవిధంగా చూడాలన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా చూడడంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు -ఉపయోగపడేవిధంగా ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక -రూపొందించాలని, వరికి రూ. 30వేలు, వాణిజ్య పంటలకు రూ.50వేలు పరిహారంగా అందించాలని ఆయన కోరారు.

నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించి ప్రజలపై భారాలు మోపుతున్నారని తక్షణం బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోవాలని, 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయాలన్నారు. ప్రస్తుత పంటలను కాపాడేందుకు నిరంతరాయంగా విద్యుత్ను అందించాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం -అధ్యక్షులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దొండపాటి రమేష్, రైతు సంఘం నాయకులు రవీంద్రబాబు, మిడికంటి వెంకటరెడ్డి, తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి గడల భాస్కర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments