నేటి సత్యం 
నాగర్ కర్నూలు జిల్లా..
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం తప్పింది
నేటి సత్యం. అచ్చంపేట. ఆగస్టు 19
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపైనుంచి బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి.
ఆ సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటన వల్ల నాగర్ కర్నూల్ జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.