మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
నేటి సత్యం నవంబర్ 24
శేర్లింగంపల్లి చందానగర్ సర్కిల్ 21 ముందు మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు రామకృష్ణ చందు యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల శ్రమకు తగ్గిన ఫలితం లేదని సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికులకు 26,000 ఇవ్వాలని అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం మోసం చేసిందని ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ప్రతి మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఏఐటీయూసీ జిల్లా నాయకులు చందు యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న శ్రమకు తగిన విధంగా వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సంవత్సరానికి 15 రోజుల క్యాజువల్ మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని జాతీయ పండుగలకు సెలవులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ కొమ్ము పరమేష్ అసిస్టెంట్ సెక్రటరీ జై శ్రీనివాస్ కొండలయ్య మహేందర్ అంజి బిక్షపతి మధు బాలకృష్ణ మొగులమ్మ ఏకలవ్య లావణ్య లతా జయమ్మ బుజ్జమ్మ మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ మేడానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది