నేటి సత్యం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాట్టేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఒక కంపెనీలో ప్రమాదం జరిగి కార్మికురాలు మరణించడం జరిగింది. ఈ యొక్క విషయం ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి గారికి తెలవడంతో మోహిత్ ప్లాస్టిక్ దానా కంపెనీ లో పనిచేస్తున్న కార్మికురాలి పేరు: మానాదేవి W/O రాజు రామ్,వయసు 42 సంవత్సరాలు,నివాసం:శ్రీరామ్ నగర్, బుద్వేల్ స్టేషన్,కాటేదాన్,రాజేంద్రనగర్, స్వస్థలం(బీహార్ రాష్ట్రం)ఆమె భర్త రాజారాం ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. వీరి జీవనోపాధి కోసం కంపెనీ యజమాని మొయిద్ అహ్మద్ గారితో వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయించడం జరిగింది. ఉదయం11 గంటల నుండి నైట్ 9 గంటల వరకు చర్చలు జరిపి యజమానిని ఒప్పించి ఇప్పించడం జరిగింది.