విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా. డాక్టర్ కే నారాయణ
నేటి సత్యం హైదరాబాద్ మే 12 పాదదర్శకమైన పరీక్ష వ్యవస్థ నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది డాక్టర్ కే నారాయణ దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష మరోసారి దేశ విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. లక్షలాది మంది పరీక్ష రాస్తే, అందుబాటులో ఉన్న సీట్లు కేవలం సుమారు 1.30 లక్షలే ఉండటం తీవ్ర ఒత్తిడి, అన్యాయ...