Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా. డాక్టర్ కే నారాయణ

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా. డాక్టర్ కే నారాయణ

నేటి సత్యం హైదరాబాద్ మే 12

పాదదర్శకమైన పరీక్ష వ్యవస్థ నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది డాక్టర్ కే నారాయణ

దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష మరోసారి దేశ విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. లక్షలాది మంది పరీక్ష రాస్తే, అందుబాటులో ఉన్న సీట్లు కేవలం సుమారు 1.30 లక్షలే ఉండటం తీవ్ర ఒత్తిడి, అన్యాయ పరిస్థితులకు దారితీస్తోంది.

లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవమానాలు, ఆందోళనలు, తీవ్రమైన మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ప్రోత్సహించిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను లాభాల కోసం ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చింది.

ఈ పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ శక్తులపై నియంత్రణ విధించాలి.

సిపిఐ డిమాండ్లు:

• నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పరిహారం చెల్లించాలి.

• అనారోగ్యకరమైన పోటీ, విద్యా వ్యాపారీకరణను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలు చేయాలి.

• పారదర్శకమైన, విద్యార్థి కేంద్రిత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments