నేటి సత్యం హైదరాబాద్. జూన్17
హైదరాబాద్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలి .
జాన్ వెస్లీ
సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి.
యుద్దోన్మాద ట్రంప్ పేరు పెట్టడం నిరసిస్తూ రౌండ్ టేబుల్, నిరసన ర్యాలీలు జయప్రదం చేద్దాం.
ఈటీ నరసింహ
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికన్ కాన్సిలేట్స్ రోడ్డుకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు పెడతామని ప్రకటించటాన్ని వ్యతిరేకిస్తూ
వామపక్ష పార్టీల సమావేశం ఎంబి భవన్ లో బుధవారం జరిగింది.
నిర్ణయాలు.
1. జూన్ 20వ తేదీన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉదయం 10 గంటలకు వామపక్ష నాయకులుమరియు ప్రగతిశీల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం.
2. జూన్ 21న ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున జగ్జీవన్ రామ్ విగ్రహము నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా దేశాలపై ఆధిపత్యం చెలాయించటానికి యుద్ధాలు కొనసాగిస్తున్నాడు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ సహకారంతో దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడిని హతమార్చడం జరిగింది.
వెనిజులా దేశ అధ్యక్షుని అతని భార్యను ఆ దేశ సార్వబామాధికారాన్ని తుంగలో తొక్కుతూ రాత్రికి రాత్రే వాళ్లను నిర్బంధించి అమెరికా జైల్లో నిర్బంధించటం జరిగింది.
క్యూబా పైన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా ఆ దేశంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రజలకు అవకాశం లేకుండా నిర్బంధాలు కొనసాగిస్తున్నాడు.
ఇంతటి నియంతృత్వ, ఆధిపత్య ధోరణి కలిగిన అమెరికా ట్రంప్ పేరుని హైదరాబాద్ నగరంలోని రోడ్డుకు పెట్టడం అత్యంత దుర్మార్గం వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమ, ఎం సిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్ .యు సి.ఐ(సి) హైదరాబాద్ జిల్లా కార్యదర్శి తేజ తోపాటు నాయకులు బండారి రవికుమార్, డిజి నరసింహారావు, స్టాలిన్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.