వినాయక నిమజ్జనం లో నీట మునిగి వ్యక్తి మృతి..
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్, సెప్టెంబర్ 25, నేటి సత్యం.
వినాయక విగ్రహ నిమజ్జనానికి వచ్చి కృష్ణానది నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒకటి సోమశిల గ్రామం లో జరిగినది.
ఉప్పుగూడ నివాసి ఎస్. రాజు ( 37, తండ్రి పకీర), ముది రాజ్(ఇంటి నెంబర్ 18-1-578/35) వినాయక విగ్రహాన్ని కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం లో ఉన్న కృష్ణానది నీటిలో నిమజ్జనం చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి ( చని)పోయారు.
రాజు మృతదేహం ఇంకా లభించలేదు. మృతదేహం కొరకు పోలీసులు గాలింపు చేస్తున్నారు.