Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఏఐటీయూసీ అనుబంధ సంస్థను ఆర్టీసీలో గెలిపించండి.

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ను గెలిపించండి….
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, అక్టోబర్ 6, నేటి సత్యం.
తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటియుసి అనుబంధ సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ను గెలిపించాలని రాష్ట్రస్థాయిలో క్లాస్ 3 బస్సు గుర్తు లోకల్ గా క్లాస్ 6 నిచ్చెన గుర్తును గెలిపించాలని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ కొల్లాపూర్ ఆర్టీసీ డిపోలోని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామయ్య యాదవ్ కొల్లాపూర్ ఆర్టీసీ డిపో ప్రధాన కార్యదర్శి మధు, అధ్యక్షులు కృష్ణా నాయక్ , నాయకులు గౌస్ తదితరులతో కలిసి మంగళ వారం రోజు ఉదయం కొల్లాపూర్ ఆర్టీసీ డిపోలో ప్రచారము నిర్వహించారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం అటు ప్రభుత్వాలతో యాజమాన్యం తో పోరాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం ముందు భాగాల్లో నిలిచిన సంఘం రాష్ట్ర వ్యాప్తం గా ఎంతో చరిత్ర కలిగిన సంఘం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ని గెలిపించాలని వారు ఓటర్లను వేడుకుంటు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు ఏవైనా కార్మికుల పొట్ట గొట్టే నిర్ణయాలు తీసుకుంటే వాటిని ప్రతి ఘటించే దమ్ము ధైర్యం ఏఐటియుసి కార్మిక సంఘానికి ఎంప్లాయిస్ యూనియన్ కి మాత్రమే ఉన్నాయని వారన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల అటు చట్టసభల్లో సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గళ మెత్తు న్నారని చట్ట సభల లో రాష్ట్ర స్థాయి లో స్థానికం గా ఎటు చూసినా కూడా కార్మికుల పక్షపాతి అయిన ఎంప్లాయిస్ యూనియన్ ని గెలిపించాలని వారు కొల్లాపూర్ డిపోలోని ఉద్యోగ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ పిలుపునిచ్చారు.
ఇతర సంఘాల్లో తిరిగే వ్యక్తులు ఎవరు కార్మిక పక్షపాతులు కారణి, కార్మికుల కష్టాలను తెలిసిన వాళ్ళు ఎవరో గమనించి ఓటేయాలని ఫయాజ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments