*శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి*
*ఏ ఐ ఎఫ్ డి ఎస్ జాతీయ నిర్మాణ బాధ్యులు మద్దికాయల అశోక్ ఓంకార్ గారు*
మియాపూర్. నేటి సత్యం
జూన్ 10
*అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ*
*(ఏ ఐ ఎఫ్ డి ఎస్) రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు మియాపూర్ ఎంఏ నగర్ ఆఫీసులో 2వ రోజు శిక్షణ తరగతులు ప్రారంభo అయ్యాయి*
*ఈ శిక్షణ తరగతులకు ఉపాధ్యాయులుగా*
*ఏఐఎఫ్ డిఎస్ జాతీయ నిర్మాణ బాధ్యులు మద్దికాయల అశోక్ ఓంకార్ గారు బోధించారు*
ఈ సందర్భంగా *అశోక్ ఓంకర్ గారు మాట్లాడుతూ*….. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి యొక్క వ్యక్తిగత వాదమైన మనువాదాన్నీ,విద్య కషాయికారణ అనే ఎజెండాలను అమలు చేసే దిశగా బలంగా పోనుకుంది కావున బిజెపి యొక్క మనువాద మత చాందస భావాలను వ్యతిరేకిస్తూ శాస్త్ర విద్యా విధానం కావాలని ప్రవేట్ యూనివర్సిటీల బిల్లులకు వ్యతిరేకంగా మరియు ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దుచేసి కామన్ స్కూల్ విద్యా విధానంపై అనేక పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ప సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడడానికి సరైన విధానం తీసుకురాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని ఆకస్మిక ఆలోచన, అనాలోచిత చర్యలు చేపడుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్న 17 యూనివర్సిటీలను సమగ్రంగా అభివృద్ధి చేసే బదులుగా స్కిల్ యునివర్సిటీ అనీ,స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కొన్ని పొంతనలేని చర్యలు చేపడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రింబర్స్ మెంట్ స్కాలర్ షిప్ ల నిధులు 8 వేల కోట్లు బకాయిలు
3సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనపు చెందుతున్నారు. 12 ఎస్సి గురుకులాల జూనియర్ కళాశాల మూసివేత నిర్ణయాన్నీ వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ ఫీజులు పెంచే ఆలోచన విధానాన్ని మానుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగంపై సమీక్ష నిర్వహించి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగా సమస్యల పరిష్కరణకై పెద్దపీట వేయాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో విఫలమైన కేజీ టు పీజీ విద్యా విధానంతో పాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పిపించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను భర్తీ చేసి ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేయాలనీ ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని సమరశీల పోరాటాల నిర్మించాలని వారు అన్నారు.
ఈ శిక్ష తరగతులకు ప్రిన్సిపాల్ గా
ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన గడ్డం నాగార్జున నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, ఏ ఐ ఫ్ డి ఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మలోతు జబ్బర్ నాయక్,జాతీయ కమిటీ సభ్యులు డక్క కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు టెoకటి కుమార్, గడ్డం శ్రీకాంత్, హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్ రాష్ట్ర నాయకులు మార్త నాగరాజు, పోలబోయిన రాజు, సాయిరాం రెడ్డి, కీర్తన, వేణు తదితరు పాల్గొన్నారు.
జూన్ 10