నేటి సత్యం సెప్టెంబర్ 6
*సుద్ధ పూసలు, సత్య హరిశ్చంద్రులైతే మూడోసారి గెలిచేవాళ్ళు..!*
*ఏ విచారణకైనా మేము రె”ఢీ”..!*
*అంజన్న.. నువ్వెందుకు ఉలికి పడతావ్..!?*
*మీ నాన్నకు వంద ఎకరాలు ఉంటే.. భూసంస్కరణ చట్టం ఏమైంది..?*
*పటేల్ పట్వారి చేసినోళ్లకు తెల్వదా..?*
*100 ఎకరాలు ఉన్నోళ్లకు ప్రభుత్వ భూమితో ఏం పని..?*
*మీ ఆస్తుల గురించి మేము అడగలేదు.. మీరే చెబుతున్నారుగా ..*
*సిబిఐ, ఏసీబీ విచారణ కోసం మీరే అడుగుతున్నారు..*
*మేము మాట్లాడిందేమిటి మీరు చెబుతున్నది ఏమిటి..?*
*సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విచారణలు జరుగుతాయి*
*గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు*
*ఫోన్ ట్యాపింగ్ గురించి మీకెందుకంత బాధ..*
*మా షాద్ నగర్ ప్రజలకు ఎమ్మెల్యేగా శంకర్ దొరకడం అదృష్టం*
*షాద్ నగర్ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం*
బిఆర్ఎస్ అవినీతి అక్రమాలను ఎండగట్టిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇటీవలే స్పందించారనీ.. గత పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై, కాలేశ్వరం అవినీతిపై మా ఎమ్మెల్యే స్పందించారనీ.. షాద్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ దగ్ధం చేయడం పట్ల ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారనీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అవినీతి అక్రమాలపై లేదా అక్రమ ఆస్తులపై ఆయన కుమారుల గురించి తాము మీడియా సమావేశంలో వివరించలేదని.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని? షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన కోఆర్డినేటర్ రఘునాయక్, పట్టణ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, పార్లమెంటరీ నాయకులు పురుషోత్తం రెడ్డి, అగ్గనూర్ బస్వం, చంద్రశేఖర్, సత్యనారాయణ రెడ్డి, క్యూ సెట్ శ్రీను తదితరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నిన్న మీడియా ముందు ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన తండ్రికి 100 ఎకరాల భూమి ఉండేదని చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మరి ఆ భూమిని భూసంస్కరణల చట్టం ప్రకారం ఎందుకు పేద ప్రజలకు పంచలేదని ప్రశ్నించారు. పటేల్ పట్వారి చేసినోళ్లకు ఆమాత్రం తెలవదా అని ఎద్దేవా చేశారు. ఆయన గుంట భూమి సంపాదించలేదని, ఒక్క రూపాయి లంచం తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు తమకు కూడా అర్థం కాలేదని పేర్కొన్నారు. కాలేశ్వరం అవినీతి గురించి మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే అంజయ్య తన ఆస్తులు బయట పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన కుమారుల వ్యాపారం గురించి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గురించి మీడియా ముందు వివరించడం తమ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు సవాళ్లు విసరడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఇచ్చిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రస్తావన ఆయన ఆస్తుల ప్రస్తావన ఎక్కడ ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్తుల గురించి ఏ దేవాలయాలకు అయినా వెళ్దామని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే దానివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. సిబిఐ రాష్ట్రంలోకే రావద్దని అసెంబ్లీలో తీర్మానం చేసిన కెసిఆర్ ఆయన ప్రభుత్వం గురించి ప్రజలకు తెలియనిది కాదా అని దెప్పి పొడిచారు. కానీ తమ ప్రభుత్వం సిబిఐ ఏసీబీలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఈ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి విచారణ జరుపుకోవచ్చని సూచించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అవినీతి గురించి తాము మాట్లాడలేదని కరాకండిగా చెప్పారు. సంగెంలో కోట్లాది రూపాయల విలువైన భూమిని దోచేశారని తాము చెప్పలేదని, 100 ఎకరాల ఆ స్వామి ఉన్నవారు ప్రభుత్వ భూమిని ఎందుకు తీసుకున్నారు తాము అడగలేదని, ఆయన కుమారుల ఆస్తుల గురించి మేము ప్రశ్నించలేదని, వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మీరు ఎంత మంచి వారో మాకు తెలుసని వారు పేర్కొన్నారు. మీ ఆస్తులు మా ఆస్తుల గురించి తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా విచారిస్తాం ఇందులో తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేనికైనా కాలం కలిసి వస్తుందని ప్రస్తుతం తాము కూడా అదే పనిగా పరిశీలిస్తున్నామని నర్మగర్భంగా వివరించారు. త్వరలోనే ఎవరు ఏమిటో అన్ని తెలుస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సమర్పించిన అఫీడవిట్ల ప్రకారమే తమ ఎమ్మెల్యేకు ఆస్తులు ఉన్నాయని ఎవరి ఆస్తులు ఎలా ఉన్నాయో త్వరలోనే తేలుతుందని అన్నారు. పీఏలను గన్మెన్లను ఎవరి చరిత్ర గురించి తాము ఎందుకు అడుగుతామని వారు పేర్కొన్నారు. చరిత్రల గురించి వాళ్లను అడగాల్సిన కర్మ తమ తమ పట్టలేదని తమకు అన్నీ తెలుసని పేర్కొన్నారు.
*మీ కుమారుల వ్యాపారం గురించి అడిగామా..?*
మీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడి వ్యాపారం గురించి మేము అడిగామా.. వారి ఆస్తుల గురించి మేమేమైనా ప్రశ్నించామా..? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మీ ఆస్తి వివరాలు మీరే మీడియా ముఖంగా చెప్పారు. ఎవరి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయో కాలమే నిర్ణయిస్తుంది తప్పకుండా విచారణ జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు తాము కూడా ఎలాంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.
*సుద్ధ పూసలు సత్యహరిశ్చంద్రులైతే మూడో “సారి”*
సుద్ధ పూసలు, సత్యహరిశ్చంద్రులు ఎవరో షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసని ఇందులో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పనులు మంజూరు చేయడం వేరు వాటికి బడ్జెట్ కల్పించడం వేరు పనులు ప్రారంభించడం వేరని పనులు మంజూరు చేయించి వాటిని గాలికి వదిలేసిన విధానం ఈ 10 సంవత్సరాలలో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఎవరు ఏమిటో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నియోజకవర్గంలో ప్రజలు గుర్తించారని వారు తెలిపారు. ఇక సుద్ధ పూసలు, సత్యహరిశ్చంద్రులు ఎవరో తెలిసే ప్రజలు వీర్లపల్లి శంకర్ ను గెలిపించారని ఒకవేళ వారు సుద్ధ పూసలు, సత్యహరిశ్చంద్రులు అయ్యుంటే వాళ్ళనే ప్రజలు గెలిపించే వారుకదా అని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్థానిక నాయకులకు ఎందుకంత బాధ కలుగుతుందో కూడా అర్థం కావడంలేదని, ఈ విషయంలో తాము అన్ని సాక్షాదారాలు అధికారులకు చెప్పామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నియోజక వర్గానికి మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లభించడం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. మీ ఆస్తిపాస్తులు మా ఆస్తిపాస్తులు గురించి ఎక్కడైనా చర్చించడానికి ఏ సంస్థతోనైనా విచారించడానికి తాము రెడీ అని ప్రతి సవాల్ విసిరారు.. *RK*