Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం బాల నరసింహ గారికి సన్మానం!!

సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం బాల నరసింహ గారికి సన్మానం!!

*సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా తిరిగి ఎన్నికైన ఎం బాల నరసింహ కు ఘనంగా సన్మానించిన సిపిఐ జిల్లా సమితి*

నేటి సత్యం నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 30

 

ఇటీవలే సెప్టెంబర్ 21 నుడి 25వరకు పంజాబ్ లోని చండీగఢ్ లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభలో మూడోసారి తిరిగి ఏకగ్రీవంగా జాతీయ సమితి సభ్యునిగా ఎన్నికైన ఎం బాల నరసింహ కు సిపిఐ జిల్లా సమితి నేడు ఇక్కడ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కామ్రేడ్ బాల నరసింహ ఎన్నిక నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ ఉద్యమ నిర్మాణానికి పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు బాల నరసింహ సహకారంతో జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీని తిరుగులేని మొనగాడిగా తీర్చి దిద్దుతామని జిల్లా కార్యదర్శి ఫయాజ్ తెలియజేశారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జి కే కేశవులు గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ పి విజయుడు కే యేసయ్య ఈ చంద్రమౌళి ఇందిరా భరత్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి సిపిఐ జిల్లా సమితి సభ్యులు కృష్ణాజిల్లా బుల్లెత్తుల శ్రీనివాసు తుమ్మల శివుడు రవీందర్ శంకర్ గౌడ్ మర్యాద వెంకటయ్య వెంకటమ్మ కిరణ్ ప్రేమ్ కుమార్ కాజా మైనద్దీన్ గోపాల్ అంజి నరేష్ మధు గౌడ్ గండం శ్రీనివాస శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments