Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసామాజిక న్యాయం కోసం సమరం సాగించాలి కొమ్ము భరత్

సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలి కొమ్ము భరత్

సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలి

డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము భరత్

నేటి సత్యం నాగర్కర్నూల్ అక్టోబర్ 25

దేశం రాష్ట్రంలో కొనసాగుతున్న అమానుషమైనటువంటి సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

శనివారం నాడు తాడూరు మండలం నెల్లికుదురు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 21 శతాబ్దం సైన్సు టెక్నాలజీ పురోగతి చెందుతున్న ఈ తరుణంలో ఇంకా అసమన్న తలుపు కొనసాగడం తోటి మనిషిని మనిషిగా గుర్తించకపోవడం అత్యంత అమానుషమన్నారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారిపైన హత్యలు జరుగుతున్నాయి అలాగే పరువు హత్యల పేరు మీద అనేక హింసకాండ కొనసాగుతుంది ప్రభుత్వం, యంత్రాంగం ఉపేక్ష పాత్ర వహించడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని అందుకే దళితవాడలు గిరిజన వాడలు అభివృద్ధికి వెనుకబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దళిత గిరిజన యువతకు ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలు గత 13 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టడం జరిగిందన్నారు 41 రకాల సబ్సిడీ రుణాలు ఉంటే ఏ ఒక్క దాన్నే అమలు పరచకుండా అణగదొక్కుతున్నారు పాలకవర్గాలు అని ఆయన విమర్శించారు. సబ్సిడీ వాహనాలు లేవు అలాగే స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు మంజూరు లేదు ఇతరత్రా పథకాలకు ఎలాంటి ఒక నిధిని కేటాయించకుండా దళితుల పట్ల ప్రభుత్వాలు చాలా వివక్షత చూపిస్తున్నాయని పాలకవర్గాల ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో దొరల అగ్రవర్ణాల దాడులను దళితులు ఎలా ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అలాగే ఎస్సీ ఎస్ఎస్ బ్యాక్లాగ్ పోస్టులు అలాగే అంటరానితనానికివ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే పెద్ద క్యాంపియన్ నిర్వహించాలని ప్రజల్లో అగ్రవర్ణాల్లో ముఖ్యంగా అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. అర్హులైన దళితులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, దసరా కానుకగా ప్రకటించినటువంటి మహిళలకు ఇస్తామన్న నగదును, రైతు భరోసాను ఇవ్వలేదని దీపావళి కనుక దసరా కానుకలు ప్రకటనలు తప్ప ప్రభుత్వం ఏ ఒక్కదానిని అమలుపరిచే చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదని మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ నాయకులు ఉషన్న, డప్పు కృష్ణయ్య, స్వామి, కృష్ణ, రాహుల్, ఆంజనేయులు, జగన్, బసవయ్య, రామస్వామి, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments