Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlog91 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దొంగతనంగా దారి మళ్లింపు

91 లక్షల విలువైన ధాన్యం బస్తాలు దొంగతనంగా దారి మళ్లింపు

నేటి సత్యం సిరిసిల్ల జూన్ 21

రూ.91 లక్షల విలువైన ధాన్యం బస్తాలను దొంగతనంగా దారి మళ్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు, కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో రూ.91 లక్షల విలువైన 200 బస్తాల ధాన్యం చోరీ

అపారెల్ పార్క్ గోదాంకి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేసిన మేనేజర్ ఉత్కం విజయ్(A1), వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు, రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి(A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఉత్కం విజయ్

అనంతరం విడుదలైన నిధులను పంచుకున్న నిందితులు

అలాగే ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్లు తయారు చేసి ఉత్కం విజయ్‌కు అందించిన బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6).. దానిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో ఆమోదం తెలిపిన డీఎంవో కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2)

అనంతరం విడుదలైన నిధులను పంచుకున్న ఈ ముగ్గురు

ఇంకా వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో మాత్రం దించినట్లు నమోదు

ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు తరలింపు

ఇలా విక్రయించగా వచ్చిన మొత్తాన్ని పంచుకున్న నిందితులు

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయగా, సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్లు గుర్తింపు

నిందితులు A1 ఉత్కం విజయ్, A2 కమ్మరి రాజశేఖర్, A4 చెపూరి మధుకర్, A5 వాసాల గణేష్, A6 గాజుల నవీన్‌, A7 చిటుకుల శ్రీకాంత్ అరెస్ట్.. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు,రూ.14,16,800 స్వాధీనం, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు రూ.46,21,358 ఫ్రీజ్

పరారీలో ఉన్న ఆది శ్రీనివాస్ అనుచరుడు, A3 గడ్డం స్వామి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments