Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeHyderabadమున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలి జైపాల్ రెడ్డి

మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలి జైపాల్ రెడ్డి

నేటి సత్యం బోరబండ నవంబర్ 6 మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు 26వేల రూపాయలు అమలు చేయాలి.

తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్: కే.ఏసురత్నం, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వనపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు బోరబండ ప్రాంతంలో కళ్యాణ్ నగర్ లోని పారిశుద్ధ్య కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులనీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలన్నారు. పర్మినెంట్ చేసేంతవరకు కార్మికులకు కనీస వేతనాలు 26వేల రూపాయలు అమలు చేయాలని అన్నారు. గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పారిశుద్ధ్య పనులు విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సంవత్సరానికి 15 క్యాజువల్ లీవులు ఇవ్వాలని జోనల్ కమిషనర్లకు మరియు సర్కిల్ కమిషనర్ లకు సర్కులర్ నెంబర్:632/B3/LWS/GHMC/2014/194, తేది:10/07/2024 గ్రేటర్ కమిషనర్ పంపడం జరిగింది. ఈరోజు వరకు కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారు. కార్మిక చట్ట ప్రకారం రావలసిన క్యాజువల్ లీవులు కూడా అమలు చేయకపోవడం నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.మున్సిపల్ లో పనిచేసే కార్మికులందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్మికులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన కార్మికులు విధులు నిర్వహిస్తారు. ఈ యొక్క కార్మికులకు పండుగ, జాతీయ సెలవులు కూడా అమలు చేయకపోవడం కార్మిక చట్టాలని తుంగలో తొక్కుతున్నారని అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేనెల మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, రేణుక, కృష్ణ, రుక్మిణి,కొమురమ్మ, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments