Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎస్. ఐ .ర్ పై జాగ్రత్తలు పాటించకుంటే ఓటు హక్కు పోయినట్లే

ఎస్. ఐ .ర్ పై జాగ్రత్తలు పాటించకుంటే ఓటు హక్కు పోయినట్లే

  1. నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 20

ఎస్‌ఐఆర్‌పై కార్యకర్తలకు అవగాహన కల్పించాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలి

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రత్యేక సర్వేలు, ఓటర్ల జాబితా సవరణలు (SIR) వంటి కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సరైన సమాచారం అందించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.

శేరిలింగంపల్లిలో నిర్వహించిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపులు, తప్పులు, నిర్లక్ష్యం కారణంగా పేదలు, కార్మికులు, బలహీన వర్గాల ప్రజలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో కమ్యూనిస్టు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజలకు సహాయం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కులను కాలరాస్తూ ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా సిపిఐ సహించబోదని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని, సిపిఐ శ్రేణులు గ్రామాలు, బస్తీలు, కాలనీలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని టి. రామకృష్ణ కోరారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments