Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaహలో కామ్రేడ్ ఛలో ఖమ్మం పాలమాకుల జంగయ్య

హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం పాలమాకుల జంగయ్య

*భారత గడ్డపై సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు*
*హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం*
*డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి*
*పార్టీ శ్రేణులు కదలిరండి*
*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య*

నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 8
ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన చేవెళ్ల నియోజకవర్గ నాలుగు మండలాల కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ భారత గడ్డ పైన 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షక శ్రేయస్సు కోసం సమసమాజ స్థాపన కోసం ఏర్పడిన పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ అని ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఎన్నో భూ పోరాటాలు ఎంతోమంది ప్రాణ త్యాగాల చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ పార్టీ అని డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ శ్రేణులు కార్మికులు కర్షకులు రైతులు పార్టీ శ్రేయోభిలాషులు పార్టీ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు జాతలు బయలుదేరాయని రంగారెడ్డి జిల్లాకు ఈనెల 17వ తేదీన శంకర్పల్లి మండలంలోకి బస్సు జాత ప్రవేశిస్తుందని 18వ తేదీ చేవెళ్ల మొయినాబాద్ మండలలాకు చేరుకుంటుందని పార్టీ శ్రేణులకు సూచించారు త్యాగాల, పోరాటాల చరిత్రను కార్యకర్తలు నడుము బిగించి గడపగడపకు ప్రచారం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రబులింగం జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ నాలుగు మండలాల కార్యదర్శులు చేవెళ్ల మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి శంకర్పల్లి మండల పార్టీ కార్యదర్శి సుధీర్ మొయినాబాద్ మండల పార్టీ కార్యదర్శి కే శ్రీనివాస్ షాబాద్ మండల పార్టీ కార్యదర్శి పి శ్రీశైలం ఇన్సాబు జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల జిల్లా కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ ప్రజా సంఘాల నాయకులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments