నేటి సత్యం నవంబర్ 15
*మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి*
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న పాముల ఆంజనేయులు తేదీ:14 /11/ 2025 రోజు ఉదయం విధులకు వచ్చినాడు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్(SFA) అతన్ని పేస్ స్కానింగ్ చేసి ఉదయం ఐదున్నర గంటలకు హాజరు తీసుకోవడం జరిగింది. అతను విధులు నిర్వహిస్తూ చెత్త తీసుకొని నర్సరీ దగ్గర చెత్తని తొలగించడం జరిగింది. మధ్యాహ్నం కూడా హాజరుకు రాలేదు నైట్ కూడా ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అతని కుటుంబ సభ్యులు విధులు నిర్వహించే దగ్గరికి వచ్చి మా నాన్న ఇంటికి రాలేదు అని వాకప్ చేయగా తోటి కార్మికులు ఇతరులు కలిసి చెత్త డంపింగ్ చేసే దగ్గరికి వెళ్లి చూడగా అతను అందులో కాలిపోయి శవమై కనిపించాడు. కుక్కలు కూడా కాళ్లు పీక తినడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యేసురత్నం, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నరసింహ గారితో కార్మికుడు విధులు నిర్వహిస్తున్న సమయంలోనే మరణించడం జరిగింది. కనుక జిహెచ్ఎంసి సంస్ధ నుండి ఆ కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ యొక్క కుటుంబానికి జిహెచ్ఎంసి నుండి వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. మరణించిన కార్మికుని ఇంటికి వెళ్లి భార్యా పిల్లలని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మున్సిపల్ సంఘం అధ్యక్షులు ఉజ్జిని హరినాథరావు, చర్లపల్లి రాములు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.