నేటి సత్యం.నూతన సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి* జనవరి 24
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలపై సర్పంచ్లకు మంత్రి అవగాహన కల్పించారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న మంత్రి, ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తూ సహకరిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా చెన్నూరు మండలానికి చెందిన పలువురు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు.