బ్రహ్మ దండి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
నేటి సత్యం..లైంగిక ఆరోగ్యం: పురుషుల వీర్యం బలహీనత మరియు నపుంసకత్వానికి, అలాగే జననేంద్రియ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బ్రహ్మ దండి వేర్లను మిరియాలతో కలిపి తీసుకోవాలి.
నరాల టానిక్: ఇది నరాల బలహీనతను తగ్గించి, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బ్రహ్మ దండి వేర్లను ఈత కల్లు లో కలిపి తీసుకోవాలి.
కీళ్ల నొప్పులు: ఇది వాపును తగ్గించే లక్షణాలను (Anti-inflammatory) కలిగి ఉండటం వల్ల, కీళ్ల నొప్పులు, కండరాల అసౌకర్యం మరియు కీళ్ల బిగుతును తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రహ్మ దండి మూలికను ఆముదం ఆయిల్ లో కలిపి heat చేసి దించి , గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ తో msg చేయాలి.
శ్వాసకోశ ఆరోగ్యం: శ్వాసనాళాలను శుభ్రపరచడం, దగ్గును తగ్గించడం మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యల నివారణలో సహాయపడుతుంది. ఎండిన బ్రహ్మదండి మూలిక పొడిని కషాయంగా చేసుకుని సేవించాలి.