మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐకి కుదరని పొత్తు
కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు ఒప్పుకోని కాంగ్రెస్
కొత్తగూడెంలో మొత్తం 60కి 60 డివిజన్లలో నామినేషన్లు వేసిన సీపీఐ అభ్యర్థులు
60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సీపీఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత
దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేసిన సీపీఐ అభ్యర్థులు
ఇల్లందులో సైతం కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో నామినేషన్లు వేసిన సీపీఐ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని.. ఏదులాపురం మునిసిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా, 15 వార్డుల్లో నామినేషన్లు వేసిన సీపీఐ.. మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసిన కాంగ్రెస్
భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా.. పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వెయ్యగా మొత్తం అన్ని చోట్లా నామినేషన్లు వేసిన కాంగ్రెస్