వైభవంగా శివ స్వాముల ఇరుముడులు
తెలకపల్లి నేటి సత్యం ఫిబ్రవరి 7.
మండల కేంద్రంలో 45 రోజులు కర్ణ కఠోర దీక్షతో చేపట్టిన శివ మాలాధారణ స్వాముల ఇరుముడి కార్యక్రమం శనివారం మండల కేంద్రంలోని శివాలయంలో వైభవంగా నిర్వహించినట్లు గురు స్వాములు తెలిపారు. ఇరుముడుల అనంతరం శివ స్వాములను మండల పురవీధుల గుండా భజనలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శివ స్వాములు గురు స్వాములతో కలిసి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధానానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో శివ స్వాముల కుటుంబ సభ్యులు బంధువులు భక్తులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్1 ఇరుముడులతో బయలుదేరుతున్న శివ స్వాములు