Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogత్యాగానికి భయపడిని తల్లి మాత రామాబాయి అంబేద్కర్

త్యాగానికి భయపడిని తల్లి మాత రామాబాయి అంబేద్కర్

త్యాగానికి భయపడని తల్లి – మాతా రమాబాయి అంబేడ్కర్

బాబాసాహెబ్ పోరాటానికి చివరి వరకూ నిలిచిన ధైర్యం

*తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆ క్షణాల్లో కూడా మాతా రమాబాయి అంబేడ్కర్ భయపడలేదు. ఆమెకు చావు భయం లేదు…ఎందుకంటే ఆమె జీవితం మొత్తం త్యాగంతోనే నిండిపోయింది.*

*బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆమెను ఓదారుస్తూ “మందులు వేస్తే తగ్గుతుంది…నిన్ను మంచి డాక్టర్‌కి చూపిస్తాను… నిన్ను సంతోషంగా చూసుకుంటాను…” అని అన్నప్పుడు,*

*రమాబాయి ఎంతో స్థైర్యంగా ఇలా అన్నారు – “ఏమి ప్రయోజనం లేదు… నేను బాగానే ఉన్నాను…సంతోషంగా చనిపోతాను. నాకు చావు అంటే భయం లేదు. నేను చాల చావులను చూశాను… మా అమ్మానాన్నలు… మీ అమ్మానాన్నలు… మీ అన్నగారు…*

*మన పిల్లలు నలుగురు – రమేష్, గంగాధర్, ఇందు, రాజారత్న… నా కళ్లముందే చనిపోయారు…”*

*ఈ మాటలు ఒక తల్లి హృదయం ఎంతటి బాధను భరించిందో తెలియజేస్తాయి.*

*దిగులుతో కుంగిపోయిన అంబేడ్కర్ ఆమెను ఆపుతూ “దిగులు పడకు రాము… నాకు నీవు కావాలి… నీవు లేకుండా ఉండలేను… ఈ ఒంటరితనాన్ని భరించలేను…”*

*అన్నప్పుడు కూడా రమాబాయి తన బాధను కాదు, తన భర్త బాధ్యతను గుర్తు చేసింది.*

*“నిరాశ చెందకండి… మీ పోరాటాన్ని సాగించండి… యశ్వంత్‌ని జాగ్రత్తగా చూసుకోండి…”*

*అంటూ బాబాసాహెబ్ భుజాలపై ఉన్న చరిత్ర భారాన్ని వదలకుండా, ఆ తల్లి ప్రశాంతంగా ప్రాణం విడిచింది.*

*నేడు మేము బ్రతికున్నాం అంటే అది మాతా రమాబాయి అంబేడ్కర్ చేసిన త్యాగం వల్లే.*

*నలుగురు పిల్లలను కోల్పోయి కూడా, ఎటువంటి వ్యక్తిగత సుఖసంతోషాలకు నోచుకోకుండా, బాబాసాహెబ్ చదువుకి ఎక్కడ ఆటంకం కలగకూడదని, ఈ దేశంలోని పీడిత ప్రజల విముక్తి కోసం అంబేడ్కర్ చేస్తున్న పోరాటానికి తాను అడ్డంకి కాకూడదని తన బాధలన్నింటినీ మనసులో దాచుకున్న మహాత్యాగివి మీరు, అమ్మా.*

*మీ త్యాగం ఫలితమే ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం.*

*అమ్మా… నీకు పాదాభివందనం.*

*నేడు మాతా రమాబాయి అంబేడ్కర్ 128వ జయంతి*

*జై భీమ్ ✊ జై భారత్*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments