Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఫిబ్రవరి 12న జరిగే దేశవాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

ఫిబ్రవరి 12న జరిగే దేశవాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలి – ఫిబ్రవరి 12 దేశవ్యాప్త కార్మిక సమ్మెకు డి హెచ్ పి ఎస్ సంపూర్ణ మద్దతు

నేటి సత్యం హైదరాబాద్ : ఫిబ్రవరి 9

కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఆరుట్ల రాజ్ కుమార్, జేరుపోతుల కుమార్ వై ఉషాశ్రీ లతో కలిసి హిమాయత్ నగర్ లోని రాజ్ బౌద్ధూర్ గౌరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు.

అనంతరం మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న చేపట్టనున్న సమ్మెకు డి హెచ్ పి ఎస్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్మిక వర్గం హక్కులను కాపాడే పోరాటంలో దళిత, బలహీన వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కొత్తగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, సంఘటిత హక్కులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సంస్థలకు కార్మికులను సులభంగా తొలగించే అవకాశాలు పెరగడం, పని గంటలు పెరిగే అవకాశాలు ఉండటం, కనీస వేతనాల విషయంలో అనిశ్చితి ఏర్పడటం వంటి అంశాలు కార్మిక వర్గానికి పెద్ద ముప్పుగా మారతాయని తెలిపారు. ట్రేడ్ యూనియన్ హక్కులు బలహీనపడే విధంగా రూపొందించిన ఈ చట్టాలు ప్రజాస్వామ్య హక్కులపై కూడా దాడి చేస్తున్నాయని విమర్శించారు.ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దళితులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు మరియు వలస కార్మికులు అత్యంత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ వేతనాలు, అసురక్షిత పనివాతావరణం, ఆరోగ్య భద్రత లేకుండా జీవిస్తున్న కార్మికులకు ఈ చట్టాలు మరింత భారంగా మారతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు మరియు చిన్న పరిశ్రమల కార్మికులు అత్యధికంగా నష్టపోతారని వివరించారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ విధానాలు, సామాజిక అసమానతల నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్మిక హక్కులను బలహీనపరచడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. కార్మిక వర్గం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పటికీ, వారి జీవన భద్రతను పట్టించుకోకుండా విధానాలు రూపొందించడం సామాజిక న్యాయానికి ప్రమాదకరమని తెలిపింది. కార్మిక సంఘాలతో సంపూర్ణ చర్చలు జరపకుండా చట్టాలను అమలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఫిబ్రవరి 12న జరుగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను చారిత్రాత్మక పోరాటం కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడే లక్ష్యంతో జరుగుతున్న ఈ సమ్మెలో అన్ని ప్రజాస్వామ్య శక్తులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు మరియు సామాజిక ఉద్యమాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు డి హెచ్ పి ఎస్ కార్యకర్తలు చైతన్య కార్యక్రమాలు, ప్రచార యాత్రలు, సమావేశాలు నిర్వహించి సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేస్తారని తెలిపారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి.ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు మరియు కార్మిక సంక్షేమ హక్కులను చట్టబద్ధంగా బలోపేతం చేయాలి.ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలి.అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య భీమా, పెన్షన్ మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.మహిళా కార్మికుల భద్రత, సమాన వేతనం మరియు ప్రసూతి హక్కులను బలోపేతం చేయాలి.వలస కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ విధానాలు అమలు చేయాలి.కార్మిక సంఘాలతో నిరంతర చర్చలు జరిపి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాలి అని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ అంటే కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదు, దేశ ప్రజాస్వామ్యం మరియు సమానత్వానికి సంబంధించిన అంశమని అన్నారు. కార్మిక వర్గం బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి శ్రామికుడు ఫిబ్రవరి 12 సమ్మెలో పాల్గొని కార్మిక వర్గానికి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments