Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతి

అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతి

. నేటి సత్యం అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతిని జయప్రదం చేయాలని*

యం సి పి ఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపునిచ్చారు*

నేటి సత్యం శేర్లింగంపల్లి ఫిబ్రవరి 10

ఈరోజు మియాపూర్ ఎం ఎ నగర్ పార్టీ కార్యాలయం ముందు ఉన్న అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి విగ్రహం వద్ద వారి నాలుగో వర్ధంతిని విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా వచ్చిన యం సి పి ఐ (యు ) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)యం సి పి ఐ (యు ) రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొంది నాలుగు సంవత్సరాలు అవుతుంది. కానీ వారు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనిది. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్ల స్థలాలు స్వాధీన పోరాటంలో అనేక నిర్బంధాలకు ప్రభుత్వ యంత్రాంగం ఒక తప్పుడు కేసులకు కర్కసమైన పోలీస్ దామనఖండను ఎదుర్కొన్నారు, నిలువ నీడలేని అణగారిన ప్రజలకు నీడ కల్పించడం కోసం సాగిన వారి పోరాట జీవితంలో 42 అక్రమ కేసులు అనేకసార్లు జైలు జీవితాన్ని నిర్బంధాలను ఎదుర్కొన యం సి పి ఐ (యు) ఎర్రజెండాను వదలకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు. కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాలుగో వర్ధంతిని 2026 ఫిబ్రవరి 14న *ప్రస్తుత రాజకీయాలు*- *ప్రజల కర్తవ్యం* అనే అంశంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు సదస్సులు వివిధ రూపాలలో కార్యక్రమాలను జరపడానికి ఎం సి పి ఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే తేది 14-02-2026,ఉదయం 10.00 గంటలకు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి భారీ స్తూపం నుండి ఆల్విన్ కాలనీ,పోలీస్ స్టేషన్ రోడ్,కుషినగర్ మీదుగా ఎం ఎ నగర్ వరకు జరుగు ర్యాలీ-సభ లో ప్రజలు ప్రజాతంత్ర వాదులు, వామపక్ష శ్రేణులు, నేటి కలుషిత రాజకీయ వ్యవస్థ మార్పును రూపుమాపి సమస్త మానవాళి సమానంగా జీవించే వ్యవస్థ ఏర్పాటుకు చైతన్యవంతంగా పై కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయగలరని ఎం సిపిఐ (యు )గ్రేటర్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యం సి పి ఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ సహయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, మధుసూదన్, మియాపూర్ డివిజన్ నాయకులు జి శివాని, వి అనిత, ఎండి మౌలానా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments