Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogద్విచక్ర వాహనం మీదే 10 కిలోమీటర్లు మృతదేహం.

ద్విచక్ర వాహనం మీదే 10 కిలోమీటర్లు మృతదేహం.

నేటి సత్యం ద్విచక్ర వాహనం మీదే 10 కిలోమీటర్లు మృతదేహం*.

హృదయ విధారకర సంఘటన కర్లపాలెం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న అనేదానికంటే కనీసం చనిపోయిన మృతదేహాలను గౌరవంగా ఇంటికి తరలించడానికి కూడా మన దగ్గర మహాప్రస్థానం వాహనాలు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావు గుండెనొప్పి వచ్చింది. వెంటనే వారి సోదరులు కుటుంబీకులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడికి తీసుకొని వెళ్ళేసరికి నాగేశ్వరరావు మృతి చెందారు. అయితే ఆటోలో మృతదేహాన్ని తరలించడానికి మూడు వేల వరకు అడగటంతో తమ దగ్గర అంత స్తోమత లేదని 10 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం మీదే మృతదేహాన్ని వారి గుడిసెలకు తరలించారు. ఇదంతా జరిగింది బాపట్ల జిల్లా కేంద్రానికి సమీపంలో. 10 కిలోమీటర్ల దూరంలోనే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments