Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogభక్తులకు సౌకర్యం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

భక్తులకు సౌకర్యం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

_ ముందస్తు ప్రణాళిక లు లేకపోవడంతో నే భక్తుల పై దాడి….

_ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వసతులు కల్పించాలి.

_ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు.

మంత్రాలయం:

శ్రీశైలం లో భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ శివరాత్రి పండుగ ను పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శివ మాల ధరించి ఇరుముడితో వస్తూంటారు. వీరికి అవసరమైన సౌకర్యాలను కల్పించండంలో అధికారులు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో భక్తుల అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ పెరిగి పోయింది. దీంతో గంటల తరబడి క్యూ లైన్లో నిలిచి ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కొంత మంది శివ స్వాములు బారి కేడ్లు తొలగించి బయటకు రావడం తో సహానం కొల్పోయిన పోలీసులు ఏకంగా లాఠీఛార్జి చేయడం చాలా దారుణమన్నారు. ఫారెస్టు అధికారులు, దేవస్థానం అధికారులు ముందుగానే చర్చించి 1వ తేది నుంచి శివ స్వాములకు అనుమతి ఇచ్చింటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదని మండిపడ్డారు. ఇటీవల ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్ల గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం లడ్డులో కూడా కల్తీ నెయ్యి కలిపారని మాట్లాడటం పద్దతి కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనో భావాలను దెబ్బ తీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గు చేట్టన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదే విధంగా టీటీడీ తరహా లో క్యూ లైన్లో ఉండే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి, క్యూ లైన్లలకు అనుగుణంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా భక్తులు స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. లడ్డు, ప్రసాదం విషయాల్లో కూటమి నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments