Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకృష్ణానదిపై ఐకాన్ కేబుల్ బ్రిడ్జి స్థలం పరిశీలించిన కలెక్టర్

కృష్ణానదిపై ఐకాన్ కేబుల్ బ్రిడ్జి స్థలం పరిశీలించిన కలెక్టర్

కృష్ణానది పై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్..

(యస్.పి. మల్లికార్జున సాగర్)

కొల్లాపూర్, నేటి సత్యం, ఫిబ్రవరి 10.

తెలంగాణ –ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాలను కలుపుతూ

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సోమశిల గ్రామం వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ స్థలాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భం గా రెవిన్యూ, అటవీ, జాతీయ రహదారి శాఖల అధికారులతో కలిసి వంతెన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూసంబంధిత అడ్డంకులు, పరిపాలనా అనుమతుల మంజూరు తదితర అంశాలపై కలెక్టర్ చర్చిస్తూ పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర భూభాగం నుండి ఆంధ్రప్రదేశ్ భూ భాగం వరకు 1077 మీటర్ల పొడవున ఈ హైబ్రిడ్ కేబుల్ వంతెనను ఈపీసీ విధానం లో నిర్మించనున్నారు.

వంతెన అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచడమే కాకుండా పర్యాటకాభివృద్ధికి కూడా తోడ్పడుతుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

కల్వకుర్తి నుంచి ప్రారంభమయ్యే 167 కే జాతీయ రహదారి ప్రాజెక్టు లో భాగం గా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సోమశిల గ్రామం దగ్గర కృష్ణా నది పై ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది అని,

ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణానది పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కూడా గణనీయమైన ప్రోత్సాహం, ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ ఉపాధి లు లభించనున్నాయి అని కలెక్టర్ అన్నారు.

కృష్ణా నది పై నిర్మితము కానున్న తీగల వంతెన నిర్మాణపు స్థల పరిశీలనకు వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వెంట కొల్లాపూర్ ఆర్డిఓ రెవెన్యూ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments