Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకాలనీలో వీధి దీపాల సమస్యలు - తక్షణ చర్యలు తీసుకోవాలి

కాలనీలో వీధి దీపాల సమస్యలు – తక్షణ చర్యలు తీసుకోవాలి

అమీన్ పూర్ లో పలు కాలనీల్లో వీధిదీపాల సమస్యలు – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

అమీన్‌పూర్: అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో వీధిదీపాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేజ్-1, ఫేజ్-2, రూపశ్రీ కౌంటీ, ఎస్‌ఎస్ హోమ్స్, ఆర్‌ఆర్ హోమ్స్, పీఎన్‌ఆర్ నరేంద్ర నగర్ కాలనీ, గ్రీన్ విల్లాస్, ఓడీఎఫ్ కాలనీ ప్రాంతాల్లో అనేక వీధిదీపాలు పనిచేయకపోవడం, మసకబారడం లేదా పూర్తిగా దెబ్బతినడం జరుగుతోందని పేర్కొన్నారు. తగిన వెలుతురు లేకపోవడం వల్ల మహిళలు, పిల్లలు, వృద్ధులు భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు, దొంగతనాలు వంటి సంఘటనలకు అవకాశం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల సంబంధిత విద్యుత్/మెయింటెనెన్స్ విభాగం అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి పనిచేయని వీధిదీపాలను మరమ్మతులు చేయాలని, భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments