Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఘనంగా జన్మదినా వేడుకలు.

ఘనంగా జన్మదినా వేడుకలు.

శేరిలింగంపల్లి రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకం  బీజేవైఎం రాష్ట్ర నేత నందనం విష్ణు దత్త్,‌ జన్మదిన వేడుకలు ఘనంగా

*రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి నియోజకవర్గం, మార్చ్ 03,( నేటి సత్యం పత్రిక)*

రిపోర్టర్ జెశ్రీనివాస్

శేరిలింగంపల్లి నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతూ బిజెపి పార్టీ బీజేవైఎం రాష్ట్ర నేత నందనం విష్ణు‌ దత్త్,‌ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. హఫీజ్  పెట్ డివిజన్ హుడా కాలనీ లోని ఆయన నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వేడుకలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వేదికను, ఫ్లెక్సీలు, పుష్పాలతో అలంకరించి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమంలో భాగంగా నందనం విష్ణు, కేక్ కట్ చేసి, అభిమానుల మధ్య ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు బిజెపి సీనియర్ నాయకులు, బీజేవైఎం యువ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యువతలో జాతీయ భావజాలం పెంపొందించేందుకు, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, శేరిలింగంపల్లి ప్రాంతంలో పార్టీ విస్తరణకు నందనం విష్ణు, కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ యువతకు మార్గనిర్దేశం చేస్తున్న ఆయన సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని తెలిపారు.

చిరకాల మిత్రుడైన నందనం విష్ణుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్రిక విలేకరుడు రాజా రవి, ఆయనతో పాటు పత్రికా మిత్రులు సురభి వెంకటేశ్వరరావు, అనిల్ ముదిరాజ్, మల్లాని అశోక్, కర్ర బాబు, పాల్గొని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వేడుకల్లో భాగంగా అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేయగా, స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తంగా ఈ జన్మదిన వేడుకలు రాజకీయ, సామాజిక వర్గాల సమక్షంలో ఉత్సాహంగా, ఆత్మీయంగా, ఘనంగా నిర్వహించబడటంతో శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రత్యేక చర్చకు దారి తీసాయి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments