Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరల ను తగ్గించాలి టి రామకృష్ణ

పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరల ను తగ్గించాలి టి రామకృష్ణ

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి. టి. రామకృష్ణ.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 7

కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి అవసరమైన వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ డొమెస్టిక్ పై 60 రూపాయలు కమర్షియల్ పై 115 ధరలను మళ్లీ పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.టి *రామకృష్ణ* సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు . ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో గ్యాస్ ధరలను పెంచడం ప్రజలపై మరింత భారాన్ని మోపినట్టేనని ప్రజలు మండిపడుతున్నరూ .

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న వంట గ్యాస్ ఇప్పుడు విలాసవంతమైన వస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వరుసగా ధరలు పెంచడం అన్యాయమని విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని వెంటనే తగ్గించేందుకు గ్యాస్ ధరలను తగ్గించాలని, అలాగే పేద కుటుంబాలకు మళ్లీ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని టి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిoచరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments