Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎల్పిజి గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజల ఇబ్బందులు

ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజల ఇబ్బందులు

  • ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు దొరకక ప్రజలు ఇబ్బందులు – ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం  నేటి సత్యం

పట్టణాలు, గ్రామాల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు సమయానికి దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.

ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన తరువాత కూడా రోజులు గడిచినా సిలిండర్లు సరఫరా కావడం లేదని, డీలర్ల వద్ద సరిపడా నిల్వలు లేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాథమిక అవసరమైన వంట గ్యాస్ సరఫరా విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు మండిపడ్డారు. ఇప్పటికే గ్యాస్ ధరలు అమాంతం పెరిగి సాధారణ ప్రజలపై భారం పడుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు సిలిండర్లు కూడా అందుబాటులో లేకపోవడం ప్రజలపై ద్వంద్వ భారం మోపినట్లే అవుతుందని అన్నారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి అన్ని ప్రాంతాల్లో ఎల్పిజి గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. డీలర్ల వద్ద నిల్వలను పెంచి ప్రజలకు సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాలు.ప్రజలు కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు వెంటనే మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments