Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎస్సై చైతన్య చందర్ పై వేటు.. సస్పెడ్.. l

ఎస్సై చైతన్య చందర్ పై వేటు.. సస్పెడ్.. l

ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది..

కరీంనగర్ జిల్లా: అన్నా అని పిలిచినందుకు ఓ సెలూన్ షాపు నిర్వాహకుడు పై విధి నిర్వహణలో ఉన్న ఎస్సై దాడి చేశాడు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గడ్డ, ఖాన్‌పురా, ప్రాంతం లో ఉన్న ఒక హెయిర్ కట్టింగ్ సెలూన్ ‌లో పోలీసు అధికారి ప్రవర్తనకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.​శనివారం ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎన్. చైతన్య చందర్,న్యూ ప్రజా హెయిర్ స్టైల్’ సెలూన్‌కు వెళ్లారు.

ఆ సమయంలో షాప్ శుభ్ర పరిచే పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికుడు పగడాల రాము (50) ఎస్‌ఐను చూసి మర్యాదపూర్వ కంగా అన్నా కూర్చో,అని పలకరించాడు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఐ, బాధితుడిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అతనిపై చేయిచేసుకున్నా డు.

ఈ దృశ్యాలన్నీ సెలూన్‌ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జరిగిన సమయంలో ఎస్‌ఐ చైతన్య చందర్, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బందోబస్త్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు విచారణలో తేలింది. ​

సామాన్య పౌరుడి పై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్ప డటం మరియు విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణ నివేదికలో స్పష్టమవ్వడం తో.. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం,డి.ఐ.జి. సిఫారసు మేరకు ఉన్నతాధికారులు సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.

పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. సామాన్య ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినా, చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసినా ఎంతటి వారినైనా సహిం చేది లేదు. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని కరీంనగర్ సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments