Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన

కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన

నేటి సత్యం గన్నేరువరం జూన్ 16

కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన

గన్నేరువరం, జంగపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి రామానుజ చార్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి

జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గన్నేరువరం మండలంలోని గన్నేరువరం, జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ప్రత్యేక అధికారి రామానుజ చార్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ ) శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా తనిఖీ చేశారు. 2026-27 నూతన అకడమిక్ ఇయర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

ఈ సందర్భంగా వారు పాఠశాలల్లోని తరగతి గదులు, మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్లు, విద్యార్థుల వాష్రూమ్స్, త్రాగునీటి సరఫరా వ్యవస్థను మరియు శానిటేషన్ (పరిశుభ్రత) పనులను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో ) సురేందర్, మండల విద్యాధికారి ( ఎం ఈ ఓ ) రామయ్య, పంచాయతీ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments