Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకలెక్టర్ కాళ్లు మొక్కుతే తప్ప..?

కలెక్టర్ కాళ్లు మొక్కుతే తప్ప..?

నేటి సత్యం కొల్లాపూర్ జులై 1

కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న వ్యక్తి ని దారుణం గా కొట్టిన పోలీసులు….

(యస్.పి.మల్లిఖార్జున సాగర్).

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం ( రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పాతినిధ్యం)

పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామం లో యంగ్ ఇండియా స్కూల్ పనులు పరిశీలించేందుకు వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కాళ్ల మీద పడి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్న కటికే నారాయణ(46) పై కక్షగట్టిన కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కు అవమానం జరిగింది అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఆదేశాల మేరకు, అదే రోజు సాయంత్రం నారాయణ ను ఖాకీలు పోలీస్ స్టేషన్‌కు తరలించి దారుణం గా పోలీసులు కొట్టారు.

తనను ఎందుకు కొడుతున్నారు సార్ అని నారాయణ పోలీసులను అడిగితే, నీ వల్ల కలెక్టర్‌ కు అవమానం జరిగిందని పోలీసులు చెబుతూ తనను దారుణం గా కొట్టారని బాధితుడు కటికే నారాయణ బుధవారం రోజు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (బి ఆర్ఎస్ ) నీ కలిసి తన ఆవేదన ను వ్యక్తం చేశారు.

దానికి స్పందించిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీ రం హర్ష వర్ధన్ రెడ్డి తనను అకారణం గా కొట్టిన పోలీస్ లపై న్యాయం కొరకు కోర్టు లో కేసు వేయమని స్వతహా గా లాయర్ అయిన హర్ష వర్ధన్ రెడ్డి బాధితుడు కటికే నారాయణ కు సలహా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments