Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

200 మీటర్ల త్రివర్ణ పాతాకంతో ఘనంగా తిరంగా ర్యాలీ

గన్నేరువరం ఆగస్టు 12

గుండ్లపల్లిలో 200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో ఘనంగా తిరంగా ర్యాలీ

-ఎస్.ఎల్.ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల భారీ ప్రదర్శన

-ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలo గుండ్లపల్లి స్టేజి వద్ద తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎస్.ఎల్.ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి, రాజీవ్ రహదారి పై నుండి గుండ్లపల్లి వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్ మాట్లాడుతూ.. జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులైన విద్యార్థులు, దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలని పేర్కొన్నారు.అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని కోరారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ దేశభక్తి ప్రదర్శనలో కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, పీచుపల్లి సర్పంచ్ సామా రాజిరెడ్డి, నాయకులు కరివేద మహిపాల్ రెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, బండి తిరుపతి, బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాము, గన్నేరువరం 8వ వార్డు సభ్యుడు మచ్చ సాయికృష్ణ, పంబాల రాజశేఖర్, పకిడ మహేందర్, బోయిని అభిషేక్, చొక్కాల లక్ష్మయ్య, కుర్ర హరీష్‌లతో పాటు స్థానిక యువత, ప్రజలు మరియు పాఠశాల సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments