
నేటి సత్యం కొల్లాపూర్ ఆగస్టు 12
ప్రభుత్వ పాఠశాలల్లో 15 రోజుల కృత్రిమ
మేధస్సు (ఏ ఐ) అవగాహన కార్యక్రమం…
(యస్.పి. మల్లికార్జున సాగర్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొల్లాపూర్ ఆధ్వర్యం లో “అన్న–అక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్”లో భాగం గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు పై 15 రోజుల అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల విద్యార్థినీలు పూర్తి చేశారు.
ఈ కార్య క్రమం లో ప్రభుత్వ పాఠశాలలైన జెడ్పిహెచ్ఎస్ మోడల్ కొల్లాపూర్ , జెడ్పిహెచ్ఎస్ ఎల్లూరు పాఠశాలల్లో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొని, పాఠశాల విద్యార్థులకు ఏ ఐ యొక్క ప్రాథమిక అంశాలు, రోజువారీ జీవితంలో ఏ ఐ వినియోగం, విద్యా రంగం లో ఏ ఐ ప్రాధాన్యత, ఏ ఐ ఆధారిత సాధనాల వినియోగం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
15 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్య క్రమం లో శిక్షణ, ప్రదర్శనలు, ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశారు.
కార్యక్రమాన్ని విజయ వంతం గా పూర్తి చేసిన పాఠశాల విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన నందుకు ధ్రువ పత్రాలను ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులకు బుధవారం రోజు సర్టిఫికెట్స్ అందజేసారు.
ఈ కార్య క్రమం లో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది సహకరించడం తో పాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొల్లాపూర్ కు చెందిన నోడల్ అధికారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ కుమార్ మరియు ఎం. డి. సోఫీ పాషా కార్యక్రమాన్ని విజయ వంతం గా పూర్తి చేశారు.
విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించి, భవిష్యత్తులో ఏ ఐ సాంకేతికతను విద్యా మరియు వృత్తి రంగాల్లో సమర్థ వంతం గా వినియోగించుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కొల్లాపూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ తెలియజేసారు.