Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

శేరిలింగంపల్లి అభివృద్ధి పనులకై సిఎంసి లో మ్మెల్యే

నేటి సత్యం/ శేర్లింగంపల్లి /సెప్టెంబర్ 30
శేరిలింగంపల్లి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సి ఎం సి కమిషనర్ సృజన తో పి ఎ సి చైర్మన్ గాంధీ భేటీ..

.. శేరిలింగంపల్లి

నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మాదాపూర్ లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లో సి ఎం సి కమిషనర్ సృజన తో సమీక్షా సమావేశం జరిపిన పి ఎ సి చైర్మన్ అరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ రహదారుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని, లింక్ రోడ్ల ను ఏర్పాటు చేయాలని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు.చందానగర్ ప్రధాన రహదారి, హైదర్ నగర్, మియాపూర్ బొల్లారం రోడ్డు లో, వివేకానంద నగర్ బాగ్అమీర్ కాలనీ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు అని, ప్రమాదాలు జరుగునని, పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా ఉండునని, ప్రజలు రోడ్డు దాటే సమయంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ప్రమాదాల బారిన పడుతున్నారు అని, పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేల చర్యలు తీసుకోవాలని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు.ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తుంది అని, వేగంగా వెళ్లే వాహనాల మధ్య రోడ్డు దాటే ప్రమాదాలను తగ్గిస్తుంది అని, జనాల రాకపోకల వల్ల రోడ్లపై ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గిస్తుంది.అని , వృద్ధులు, దివ్యాంగుల కోసం మెట్లతో పాటు లిఫ్ట్‌లు లేదా రాంప్‌లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని గాంధీ తెలియచేశారు.

మసీదు బండ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోతున్నవారికి సముచిత న్యాయం చేయాలని,వారి జీవనాధారం కోల్పోవడం జరుగుతుంది కావున అందరికీ సమ న్యాయం చేయాలని, టి డి ఆర్ ప్రక్రియ ను వేగవంతం చేయాలని, అదేవిధంగా అంజయ్య నగర్ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, తారా నగర్ రోడ్డు విస్తరణ పనులు వేగం పెంచాలని , ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కెల చూడాలని,రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని, అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వాలని, టౌన్ ప్లానింగ్, సి ఎం సి ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేసేలా చూడాలని కమిషనర్ గారిని కోరడం జరిగినది అని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు.

గంగారం చెరువు నుండి జాతీయ రహదారి (ఎన్ హెచ్-65) అపర్ణ హిల్ పార్క్ వరకు లింక్ రోడ్డు టెండర్ పూర్తి అయినది అని, సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ ని కోరడం జరిగినది. ఈ లింక్ రోడ్డు వలన ప్రజలకు ఎంతో సాంత్వన చేకూరునని, ట్రాఫిక్ సమయం తగ్గి, ఇంధనం ఆదా అవునని చైర్మన్ గాంధీ తెలియచేశారు.అదేవిధంగా శేరిలింగంపల్లినియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని, పార్కులను అభివృధి చేయాలని, వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని అధికారులు అందరూ సన్నద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని , అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా, సమన్వయం తో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది అని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీమతి సృజన మాట్లాడుతూ పైన పేర్కొన్న అంశాల పై సానుకూలంగా స్పందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సి సి పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments