బస్సు బైక్ డీ ఒకరు మృతి కామారెడ్డి అక్టోబర్ 6 నేటి సత్యం ప్రతినిధి నసురుల్లాబాద్ మండలం కంశెట్ట్ పల్లి చౌరస్తా వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.
బైక్ ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో .బైక్ నడిపిస్తున్న కాట్రోత్ శంకర్ మిథ్య తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందాడు.శంకర్ హాజీ పూర్ రాజేష్ తండా కు చెందినవాడిగ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ హైవే పనులు నత్త నడకగా సాగడం అంతేకాకుండా కొన్ని సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయని దీనివల్ల తరుచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నాను