నేటి సత్యం/ శేరిలింగంపల్లి /
అక్టోబర్ 18
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
సీపీఐ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
**శేరిలింగంపల్లి:** భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ప్రజానాట్యమండలి శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమని కి..కె సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సంబరాలకు ..సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అన్నారు
టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో మానవ సంబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ప్రజల సంస్కృతి, కళలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజానాట్యమండలి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళల హక్కులు, సామాజిక సమానత్వం, ప్రజాసాంస్కృతిక చైతన్యం కోసం ప్రజానాట్యమండలి ముందుండి పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే చందు యాదవ్ కె వెంకటస్వామి జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ డిహెచ్పిఎస్ సహాయ కార్యదర్శి. కే సుధాకర్ ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎస్ కొండలయ్య వాసు రామస్వామి ఎం వెంకటేష్ ఎస్ నరసమ్మ ఎస్ కుమార్ ఎస్ రుకేశ్వర్ కేకాసిం పెద్ద ఎత్తున మహిళలు, ప్రజానాట్యమండలి కళాకారులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.