Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ప్రభుత్వ భూమిపై ప్రజలకె హక్కు.

నేటి సత్యం /శేర్లింగంపల్లి/ నవంబర్ 3

మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనం కోసం కేటాయించాలి..

ప్రజల నివాసాలకు పట్టాలు ఇవ్వాలి..

ప్రభుత్వ భూమిని అమ్మితే ప్రజా పోరాటాలు తప్పవు..

యంసిపిఐ (యు)రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి హెచ్చరిక..

శేరిలింగంపల్లి. మియాపూర్ గ్రామ సర్వే నంబర్ 100,101 లలో కాలనీలలో నివాసాలు పోను మిగిలిన 550 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని,ప్రజల నివాసాలకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధత చేయాలని, ప్రభుత్వ భూమిని అమ్మితే ప్రజా పోరాటాలు తప్పవని యంసిపిఐ (యు)రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇటీవల శేర్లింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ సర్వే నంబర్ 100,101 లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు వెలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి ప్రజా పాలన సాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం వల్ల ఈ భూమిని అమ్మకూడదని ఇక్కడ నివాసాల వారికి ఇంటి పట్టాలి వాళ్ళని డిమాండ్ చేస్తూ మాంళ వారం రోజు 100,101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ నివాసాలను ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు సందర్శించారు. తదనంతరం స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ వాసులతో జరిగిన సమావేశంలో యంసిపిఐ (యు)రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి మాట్లాడుతూ.. మియాపూర్ గ్రామ పరిధిలోని 100, 101 సర్వే నంబర్లలో 550 ఎకరాల భూమితో పాటు అనేక సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయని నాలుగు దశాబ్దాల క్రితమే యంసిపిఐ (యు) ప్రభుత్వాలకు తెలియజేసిందని గుర్తు చేశారు. 1994లో అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శాసనసభ్యునిగా ఉన్న సమయంలోనే శాసనసభలలో మియాపూర్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జాలకు గురి అవుతున్న భూములపై చర్చపెట్టి ప్రభుత్వాలను నిలదీశారని గుర్తు చేశారు. ఆ సందర్భంలోనే 1996లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల నిజానిజాల కోసం త్రీసభ్య కమిషన్ వేసి ప్రజల ముందు నివేదించిందని ఆ నివేదికలో ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమిని తేలడంతోటి మియాపూర్ ఈ భూములలో వారసుల ముసుగులో దొంగ దారిన అధికారులు స్థానిక గ్రామ పరిపాలకులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని పక్కదారి పట్టించి సొసైటీల పేరుతోటి మధ్యతరగతి కార్మిక వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. మియాపూర్ లోని అనేక భూములతో పాటు ఈ 100, 101 సర్వే నెంబర్లలోని భూమి ప్రజలకు దక్కాలని ఆనాటి యంసిపిఐ(యు)ఉద్యమం తాండ్ర కుమార్ నాయకత్వంలో స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ లను ఏర్పాటు చేసి ప్రజలకు నివాసాలు ఏర్పడటం జరిగిందని గుర్తు చేశారు. ప్రాంతంలో భూ బకాసురుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయి అనేక ప్రభుత్వ భూమి లో అపార్ట్మెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకబ్జాలకు గురి అయిందని భూమిని రక్షించడానికి యంసిపిఐ (యు) నాయకత్వం అనేక త్యాగాలు చేస్తూ జైలకు కేసులు పెట్టించుకోవడం జరిగిందని అనప్పటికీ ఇది పేదలకు ఇళ్ల స్థలాల కింద దక్కించాలని పోరాటాలు జరిగాయని ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని గత రాష్ట్ర ప్రభుత్వాల పాలనలాగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంటే పేద ప్రజలకు న్యాయం జరగదని అన్నారు.ఆర్థిక వనరులను సమకూర్చడంతోనే సంక్షేమం జరిగితే ప్రజలకు ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయలేక ప్రభుత్వ భూములను అమ్మకాలు పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు ఆమ్మకం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కాపాడాలని ప్రజల నివాసాలు నిలబెట్టడానికి కృషి చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. మియాపూర్ 100,101 లలోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకూడదని ఈ భూమిలో స్టాలిన్ నగర్ ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీవాసుల నివాసాలకు ఇంటి పట్టాలు ఇచ్చి చట్టబద్ధత చేయాలని, మిగులు భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ప్రభుత్వ భూమిని అమ్మితే ప్రజా పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల అమ్మకమే రాష్ట్ర ప్రభుత్వ పనిగా ఉందని ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టారని కార్యక్రమానికి హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి నరసింహారావు అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారని అన్నాడు విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించారని హైటెక్ పాలనను అరిచేతుల్లో చూపుతున్నట్లు ఆనాడు ప్రజలను అణిచివేశారని ఈనాటి రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడే కాబట్టి ప్రజలకు మేలు చేయలేని విధంగా ఆయన గుణగణాలు ఉన్నాయని ప్రభుత్వ భూముల జోలికి వస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు జే.వి చలపతిరావు గారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఇక్కడ నివాసాలు ఉంటున్న పేద ప్రజల పట్ల కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా త్యాగాల పూరితంగా పోరాటాలు చేసిందని ఆ పోరాటాలు మరిచిన గత ప్రభుత్వాలు ఏమి చేయలేకపోయాయని ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పి హక్కులు సాధించుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయాన్ని తీయాలని వారి ప్రయోజనాల కోసం వినియోగించి ఇక్కడ నివాసాలకు చట్టబద్ధత చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హన్మేష్ మాట్లాడుతూ.. ఈ వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి రియల్ స్టేట్ వ్యాపారులకు వరం అయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగానే భూమిని అమ్మేస్తున్నట్టు ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాన్ని ప్రకటించుకుందని హైదరాబాద్ మహానగరంలో ఈ భూమి రియల్ ఎస్టేట్ కబంధ హస్తాలకు వెళ్లకుండా ప్రజల అవసరాల కోసం వినియోగించాలని ఇక్కడ నివాసాలు ఉన్న కాలనీలలో ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఇండ్ల జోలికి రాష్ట్ర ప్రభుత్వం రాకూడదని అలా జరిగితే ప్రజలు పోరాటాలు చేయడానికి చైతన్యవంతులుగా ఉన్నారని అన్నారు. ఎస్ యుసిఐ(సి)రాష్ట్ర కమిటీ సభ్యులు జానీ పాషా మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానిస్తున్నారని అందుకే ఇలాంటి ప్రజలకు చెందవలసిన ఇలాంటి భూమిని పెట్టుబడిదారులకు దార దత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అలాంటి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. యంసిపిఐ (యు) పొలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, మోర్తాల చందర్రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్యలు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.తుకారాం నాయక్, పానుగంటి నరసయ్య, రవి,తిరుపతి,గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు అంగడి పుష్ప, తాండ్ర కళావతి,కర్ర దానయ్య ఇస్లావత్ దశరథ్ నాయక్,పల్లె మురళి, సిపిఎం రంగారెడ్డి జిల్లా నాయకులు సి శోభన్, కృష్ణ, జి శివాని,డి. శ్రీనివాసులు, మహేష్,ఎన్ నాగభూషణం, డీ.కే నారాయణ, సూర్తనా బేగం,రజియా బేగం,ఎం రాణి, ఎన్ గణేష్,కొడిపాక రాజు,యం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments