Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం!

నేటి సత్యం నవంబర్2 నాగర్  కర్నూల్ జిల్లా.

*బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు*

నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లి గ్రామం లో బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 18 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయికి వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం రావడంతో హఠాత్తుగా నాగర్ కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్, డీసీపీయూ యూనిట్ సభ్యులు, పోలీసులు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా బాల్య వివాహం జరుగుతున్న చెన్నపురావుపల్లి గ్రామానికి చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తో 9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఇచ్చి బలవంతం గా పెళ్లి చేయాలనీ ప్రయత్నించారు. అమ్మాయి జిల్లా బాలల సంరక్షణ సమితికి సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకొని పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మాయి ని తరలించి చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందుకు హాజరు పరిచారు. అమ్మాయి కి, వారి సోదరుని కి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం అమ్మాయి ని బాలసదన్ తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ యూనిట్ 5 ప్రతినిధులు జంగిటి మధుబాబు, లలిత, చైల్డ్ హెల్టైన్ ప్రమీల, స్థానిక అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments