Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

మియాపూర్ భూములు సర్కారు వే

నేటి సత్యం! మియాపూర్! అక్టోబర్ 30

మియాపూర్ భూములు సర్కారు వే…

550 ఎకరాల 39 గుంటల స్థలం

సుప్రీంకోర్టు తుది తీర్పు

* రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై పహానిలో అక్రమంగా పేర్లు నమోదు

* 1949 జాగిర్ల రద్దు చట్టంతోని భూములు ప్రభుత్వ పరం

* వీటి విలువ సుమారు 20 వేల కోట్లకు పైనే..!

హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలో ఉన్న 550 ఎకరాల 39 గుంటలు అత్యంత విలువైన భూమిపై

రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ భూములపై యజమాన్య హక్కులు కోరుతూ బండారి రామచందర్ తో పాటు ఇతర వ్యక్తులు కో ఆపరేటివ్ సొసైటీలు దాఖలు చేసిన పలు సివిల్ అప్పులను కొట్టివేసింది ఈ వివాదంలో ఉమాడి ఏ పి హైకోర్టు 2003 ఏప్రిల్ 16 ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ఎంఎం సుందరిష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం గురువారం 44 పేజీల తుది తీర్పు వెలువరించింది…

* *సర్కారీ పోరంబోకు ఆపై జాగీరు*

* మియాపూర్ లోని సర్వేనెంబర్ 100లో 2007.05 ఎకరాలు. సర్వేనెంబర్ 101 లో 253.34 ఎకరాలు కలిపి మొత్తం 550 ఎకరాల 39 గుంటల భూమి దశాబ్దాలుగా వివాదంలో ఉంది 1912లో జరిగిన సర్వే ప్రకారం ఈ భూములను సత్వార్. క్లాసర్ రికార్డుల్లో సర్కారీ పోరంబోకుగా నమోదు చేశారు ఆ తర్వాత 1927లో జస్టిస్ రిలీఫ్ నేతృత్వంలోని పైగా కమిషన్ నివేదిక ఆధారంగా నిజాం నవాబు ఈ మియాపూర్ గ్రామానికి బేగానికి జాగిరు గా కేటాయించారు.

* 1929లో మరో నిజం జారీచేసిన ఫార్మన్ ద్వారా ఈ జాగిలో ఆమె వారసులకు దక్కాయి 1949 ఆగస్టు 15 ఏపీ తెలంగాణ ప్రాంత జాగిర్ల రద్దు చట్టం అమల్లోకి రావడంలో ఈ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటిలో హైదరాబాద్ స్టేట్ దివాని పరమయ్యాయి ఈ చట్టం ప్రకారం జాగిర్దారులకు కేవలం నష్టపరిహారం కమ్యూనిటీ స్టేషన్ మొత్తం మాత్రమే దక్కుతుంది..

* రఫీ ఉనిస బేగం కుమారుడు నవాబ్ మహమ్మద్ కైనరుద్దీన్ కాన్. రూ. 1.20.303 కమ్యూనికేషన్ పరిహారాన్ని తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేశాయి పరిహారం తీసుకున్న తర్వాత ఈ భూములపై అతనికి గాని వారసులకు గాని ఎలాంటి హక్కులు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది..

* *సీఎం చొరవతో ప్రభుత్వ*

* మియాపూర్ భూ వివాదంలో సుప్రీంకోర్టులో విజయం లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది

* సుప్రీం కోర్ట్ అప్పి లను కొట్టివేయడంతో రూ వేల కోట్ల విలువైన భూములపై ప్రభుత్వం హక్కులు పరిరక్షణ కీలకము ముందడుగు పడింది అని చెప్పవచ్చు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వెలువడటం పట్ల జిహెచ్ఎంసి మున్సిపల్ రెవిన్యూ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు ఈ భూముల విలువ సుమారు 20 వేల కోట్లకు పైగా ఉంటుందని హెచ్ఎండిఏ ఉన్నతాధికారి తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments