నేటి సత్యం.ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా 11 ఏఈడీపీ కోర్సులు
*డిగ్రీ చదువుతూనే అప్రెంటిస్ షిప్ కొలువులు గ్యారంటీ**
*డైరీ, ఫిషరీస్, యానిమేషన్ వంటి కోర్సులకు గ్రీన్ సిగ్నల్**
*ప్రస్తుతం ఉన్న 6,360 సీట్ల నుంచి 11,280 కి పెంపు**
డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే తిప్పలు ఇకపై ఉండవు. చదువుకుంటూనే పని నేర్చుకోవడం.. కోర్సు పూర్తి కాగానే కొలువు సాధించడమే లక్ష్యంగా అప్రెంటిస్ఆప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ) కోర్సులను విద్యాశాఖ విస్తరిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి కొత్తగా మరో 11 ఏఈడీపీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు తాజాగా హయ్యర్ ఎడ్యు కేషన్ వీసీల సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటివరకు 15 కోర్సులు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజా నిర్ణయంతో మొత్తం కోర్సుల సంఖ్య 26కు చేరనుంది.*
*కొత్తగా 11 వెరైటీ కోర్సులు..*
మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను కళాశాల విద్యాశాఖ, హయ్యర్ ఎడ్యు కేషన్ కౌన్సిల్ అధికారులు ఎంపిక చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ అండ్ మీడియా, హెల్త్ తదితర రంగాల నుంచి మంచి భవి ష్యత్తు ఉన్న విభాగాలకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా రాబోతున్న వాటిలో బీఎస్సీ డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫుడ్ టెక్నాలజీ మేనే జ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. అలాగే భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ‘ఈమొబిలిటీ అండ్ బ్యాటరీ’ కోర్సును, క్రియేటివ్ రంగం వైపు వెళ్లే విద్యార్థుల కోసం బీఏ యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ వంటి కోర్సులనూ లిస్టులో చేర్చారు. మెడికల్ రంగంలో డిమాండ్ ఉన్న బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును కూడా అప్రెంటిస్ షిప్ కిందకు తెచ్చారు.*
*భారీగా పెరగనున్నసీట్లు..*
కొత్త కోర్సుల రాకతో ఏఈడీపీ విభాగంలో సీట్ల సంఖ్య దాదాపు రెట్టింపు కానుంది. ప్రస్తుతం ఉన్న 15 కోర్సు ల్లో 6,360 సీట్లు మాత్రమే ఉండగా, వచ్చే విద్యాసం వత్సరం నుంచి కొత్త కోర్సులతో కలిపి 11,280కి పెంచాలని అధికారులు నిర్ణయించారు. దాదాపు ఐదు వేల సీట్లు కొత్త కోర్సుల్లో ఉండే అవకాశం ఉంది. ఈ ఏఈడీపీ కోర్సుల అసలు ఉద్దేశం విద్యార్థులను నిరుద్యోగులుగా మిగల్చకుండా చూడటమే. డిగ్రీలు పూర్తి చేసిన వారు స్కిల్స్ లేక ఉద్యోగాల కోసం తిప్పలు పడుతుంటే, ఈ కోర్సుల్లో చేరినవారు కంపెనీల్లో అప్రెంటిస్ షిప్ పూర్తి చేస్తారు. థియరీతోపాటు ప్రాక్టి కల్ నాలెడ్జ్ ఉండటంతో కోర్సు పూర్తి కాగానే సదరు కంపెనీలే వీరిని పర్మనెంట్ ఉద్యోగిగా తీసుకుంటాయి..*
*కొత్త కోర్సులు ఇవే..*
బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, బీఎస్సీ ఇమొబిలిటీ అండ్ బ్యాటరీ (ఎలక్ట్రిక్ వాహనాల రంగం), బీఎస్సీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్, బీఎస్సీ డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీఏ యా నిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, బీఏ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కొత్త కోర్సులు ఉన్నాయి.*