Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసుల్తాన్పూర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సుల్తాన్పూర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

*సుల్తాన్‌పూర్‌లో పరిశ్రమలో అగ్ని ప్రమాదం*

నేటి సత్యం అమీన్పూర్ ఏప్రిల్ 19అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లో గల ‘యాస్’ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాన్ కాయిల్ తయారీ ఓవెన్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పేలుడు ధాటికి పలు మంటలు చెలరేగి, భారీగా నల్లటి పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments