Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి  కేసీఆర్ ఎంతో కృషి చేశారు..

(యస్. పి. మల్లికార్జున సాగర్).కొల్లాపూర్, ఏప్రిల్ 23, నేటి సత్యం.

ఆర్టీసీ సంస్థ ను కాపాడడానికి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని కానీ నేటి పాలకులు ఆర్టీసీ ని ఆగం చేస్తూ ఆర్టీసీ సంస్థ సంపాదన దోచ్కు తింటున్నారని కార్మికులను నడిరోడ్డు పై పడేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (బి ఆర్ఎస్) విమర్శించారు.

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు చేస్తున్న సమ్మె రెండవ రోజు లో భాగం గా గురువారం రోజు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్యాలయం నుండి కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.

కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు.

కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ముందు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మద్దతు తెలుపుతూ ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్నారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కొరకు ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కొరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకు వేతనాలు అందించాలని ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను అభివృద్ధి చేయాలని ఎంతో ముందు చూపుతో కృషి చేశారని ఆయన అన్నారు.

కానీ నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం లేదు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గా ఆర్టీసీ కార్మికులకు వేతనాలను అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడం లేదని రోజుకు కోట్లల్లో రూపాయలను సంపాదించే ఆర్టీసీ కార్మికులు దినదిన గండము గా కుటుంబ సభ్యుల కు దూరము గా ఉంటూ ఉద్యోగాన్ని వెలగదీస్తున్నారని ఆయన ఆవేదనను వెలిబుచ్చారు.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వారి ఉద్యోగ భద్రత కు సరైనదే అని ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో పూర్తిగా విలీనం చేసుకుంటూ ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గా జీతభత్యాలను ఇవ్వాలని కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments