పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తేజస్వి సూర్య సందర్భంలో తెలంగాణ పైన అడ్డగోలుగా, అవమానకరంగా మాట్లాడితే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారు
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా వాళ్ళకు? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదు?
అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా క్షమాపణ చెప్పించేటోళ్ళము
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించారు
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలబెట్టాం
కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాలలో నెంబర్ వన్, కూలగొట్టడంలో నెంబర్ వన్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది
ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతకానితనంతో ఉన్నది
ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుంది
చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తుంది
సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేసిన కేసీఆర్