Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఈధులకుంట చెరువును కాపాడండి.

ఈధులకుంట చెరువును కాపాడండి.

నేటి సత్యం శేర్లింగంపల్లి మే 4.చెరువును చరబట్టిన వారిపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసు పెట్టండి. చెరువును చెర నుండి విడీ పించండి. *టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

.. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్ సర్వేనెంబర్ 7. ఈదులకుంట చెరువును సెల్లార్ తొవ్వుతూ చెరబడుతున్నారు భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని ఈదులకుంట చెరువును కాపాడాలని తమరికి విజ్ఞప్తి.

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 7లో గల 6.05 ఎకరాల చెరువు స్థలాన్ని కూకట్ పల్లి సర్వే నెంబర్ల పేరుతో కబ్జా చేసి సెల్లార్ తొవ్వుతున్న ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుట గురించి

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ ఈదులకుంట చెరువు కనుమరుగవుతుంది. ఇంకో నాలుగు ఐదు రోజులు ఆగితే చెరువు స్థలములో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తాయి. ఇప్పటికే చెరువును ఎన్వీఎన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆధీనంలోకి తీసుకొని, ఈదులకుంట చెరువు స్థలంలో షరవేగంగా సెల్లార్ తవ్వేస్తున్నారు. అందులో నిర్మాణాలు చేసేందుకు సన్నదమవుతున్నారు. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ చెరువును సందర్శించి ఇది ఈదులకుంట చెరువేనని డిక్లేర్ చేశారు.

ఖానామెట్ సర్వేనెంబర్ 7లో ఉన్న 6 ఎకరాల 5 గుంటలు ఇది ప్రభుత్వ భూమి అని ఈదులకుంట చెరువుగ పేర్కొటు రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా వివరాలు ఇచ్చారు. హైడ్రా ఏర్పాటు తర్వాత మరోసారి కబ్జా నుండి కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు ప్రజలు.

దీనిపై స్పందించిన కమిషనర్ ఈదులకుంట చెరువును మూడు సార్లు స్వయంగా సందర్శించి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు చెరువు వద్దకే పిలిపించి హద్దులను నిర్ణయించాలని ఆదేశించారు. అప్పటికి చెరువు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను పరిశీలించిన ఆయన తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కానీ ఇప్పుడు పెద్ద పెద్ద జెసిబిలతో సెల్లార్ కొడుతూ చెరువును కనుమరుగు చేశారు. దయచేసి చెరువులు కాపాడాలని తమరికి విజ్ఞప్తి..

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. శేర్లింగంపల్లి కార్యదర్శి కె చందు యాదవ్. సిపిఐ జిల్లా సమితి సభ్యులకి వెంకటస్వామి. కేకాసిం జే శ్రీనివాస్ బి నారాయణ రఘు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments